Sunday, May 5, 2024

పవన్‌ కు మొత్తం రూ. 64 కోట్ల అప్పులు

వదిన దగ్గర అప్పు రూ. 2 కోట్లు
టీఎస్​, న్యూస్​: పవర్ స్టార్‌ పవన్‌ కళ్యాణ్‌ అప్పుల్లో ఉన్నారు. అందినకాడల్లా అప్పులు చేస్తున్నారు. చివరకు సొంత తన వదిన అయిన సురేఖ వద్ద దాదాపు రెండు కోట్ల వరకు అప్పు ఉన్నట్లు లెక్క చూపించారు. జనసేన అధినేత పవన్ ఈసారి పిఠాపురం ఎమ్మెల్యేగా ఎన్నికల బరిలో నిలుస్తున్నారు. ఇందుకు సంబంధించి నామినేషన్‌ను మంగళవారం దాఖలు చేశారు. ఈ ఎన్నికల అఫిడవిట్‌లో తన ఆస్తులకు సంబంధించి కీలక వివరాలు పొందుపర్చారు. వాటిలో ఆయన వదిన అయిన సురేఖ వద్ద రెండు కోట్లు అప్పు ఉన్నట్లు ఆయన అప్పుల వివరాల్లో పేర్కొన్నారు.

సంపాదన రూ. 114 కోట్లు
అఫడవిట్​లో అధికారికంగా వెల్లడించిన వివరాల ప్రకారం పవన్ కల్యాణ్ ఐదేళ్ల సంపాదన రూ. 114.76 కోట్లుగా చూపించారు. ప్రభుత్వానికి పవన్ చెల్లించిన పన్నులు రూ. 73.92 కోట్లుగా ఉండగా, ప్రజలకు, చారిటీలకు అందజేసిన విరాళాలు రూ. 20 కోట్లు. పవన్ కల్యాణ్ అప్పులు రూ. 64.26 కోట్లు. ఆదాయ పన్నుగా రూ. 47 కోట్లు, జీఎస్టీకి రూ. 5 కోట్లు చెల్లించారు. అప్పుల్లో వివిధ బ్యాంకుల నుంచి రూ. 17.56 కోట్లు తీసుకోగా.. వ్యక్తుల వద్ద నుంచి తీసుకున్నవి రూ. 46 లక్షల అప్పు ఉన్నాయి. వివిధ సంస్థలు, జనసేన పార్టీ నిర్వహించిన సేవా కార్యక్రమాలు, పార్టీ కార్యక్రమాల కోసం రూ.17.15 కోట్లు విరాళం, వివిధ సంస్థలకు రూ.3.32 కోట్లు విరాళంగా అందజేశానని అఫడవిట్​లో వెల్లడించారు. కేంద్రీయ సైనిక్‌ బోర్డుకు రూ. కోటి, ఏపీసీఏంఆర్‌ఎఫ్‌ కోసం రూ.50 లక్షలు, తెలంగాణ సీఎంఆర్ఎఫ్‌ కోసం రూ.50 లక్షలు, శ్రీరామ జన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్ట్‌కు రూ.30.11 లక్షలు అందజేశానని పేర్కొన్నారు.

పవన్ కు అప్పు ఇచ్చిన వారు వీరే
వీఆర్‌ విజయలక్ష్మీ – 8 కోట్లు
హారిక అండ్‌ హాసిని క్రియేషన్స్‌ – 6.35 కోట్లు
లీడ్‌ ఐటీ ఇండియా ప్రైవేటు లిమిటెడ్‌ – 6 కోట్లు
ఎంవీఆర్‌ఎస్‌ ప్రసాద్‌ – 3.5 కోట్లు
యెర్నేని నవీన్‌ – 5.50 కోట్లు
ఎం.ప్రవీణ్‌కుమార్‌ – 3 కోట్లు
మైత్రీ మూవీ మేకర్స్‌ – 3 కోట్లు
శ్రీయశ్వంత్‌ ఫైనాన్షియర్స్‌ – 3కోట్లు
రాహుల్‌ కుందవరం – 2.80 కోట్లు
ఎంవీఆర్‌ఎస్‌ ప్రసాద్‌ – 2 కోట్లు
కొణిదెల సురేఖ -2 కోట్లు
కోటంరెడ్డి సాహిత్య రెడ్డి – 50 లక్షలు
లింగారెడ్డి లలిత – 50 లక్షలు
ఏ దయాకర్‌ – 45 లక్షలు
డీవీవీ ఎంటర్‌ప్రైజెస్‌ రూ.10 లక్షలు

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌దాన వార్త‌లు

బీజేపీ స‌ర్కార్ తెలంగాణ‌లో కాంగ్రెస్ ప్ర‌భుత్వాన్ని కూల్చివేసేందుకు కుట్ర‌ జ‌రుపుతుందా?

Most Popular