Thursday, May 9, 2024

తెలంగాణలో ఘర్ వాపసీ మొదలు పెట్టాం

  • తెలంగాణలో ఘర్ వాపసీ మొదలు పెట్టాం
  • రెండు రోజులుగా ఇదే జరుగుతోంది
  • ఏఐసిసి నిర్ణయాల మేరకే నడుచుకుంటాం
  • టిపిసిసి వర్కింగ్ ప్రెసిడెంట్, చేరికల కమిటీ సభ్యుడు జగ్గారెడ్డి

తెలంగాణలో ఘర్ వాపసీ మొదలు పెట్టామని, రెండు రోజులుగా ఇదే జరుగుతోందని టిపిసిసి వర్కింగ్ ప్రెసిడెంట్, చేరికల కమిటీ సభ్యుడు జగ్గారెడ్డి స్పష్టం చేశారు. శుక్రవారం ఆయన గాంధీభవన్‌లో మీడియాతో మాట్లాడుతూ చాలా మంది నాయకులు కాంగ్రెస్‌లోకి వస్తున్నారని, సంబాని చంద్రశేఖర్‌లాంటి వాళ్లు కూడా వెనక్కి వచ్చారని ఆయన అన్నారు. ఏఐసిసి నిర్ణయాల మేరకే నడుచుకుంటామని, మనకు పదవులు ఇచ్చిన సోనియాగాంధీ, రాహుల్‌గాంధీల ఆదేశాల మేరకు వ్యవహారిస్తామన్నారు. రాజీవ్ గాంధీని చంపిన వ్యక్తులను క్షమించిన గుణం సోనియాగాంధీ, రాహుల్‌గాంధీ, ప్రియాంకలది ఆయన అన్నారు. మనం వాళ్ల నీడలో రాజకీయంగా బతుకుతున్నామన్నారు. క్షమించే తత్వం ఉన్న కుటుంబం వాళ్లదని ఆయన తెలిపారు.

బిజెపి మతతత్వ రాజకీయాలు చేస్తోంది

తనకు వ్యతిరేకంగా పని చేసిన వాళ్ల కూడా కాంగ్రెస్ పార్టీలో చేర్చుకోవచ్చని ఆయన అన్నారు. సంగారెడ్డి బిఆర్‌ఎస్ ఎమ్మెల్యే కాంగ్రెస్‌లో చేరుతానంటే చేర్చుకునేందుకు మేం సిద్ధంగా ఉన్నామని ఆయన ప్రకటించారు. వచ్చే ఎన్నికల్లో టికెట్ అడిగితే ఎలా అన్న ప్రశ్నకు కూడా ఇచ్చేయండి అని చెప్పానని ఆయన తెలిపారు. బిజెపి మరోసారి అధికారంలోకి వస్తే కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా మైనార్టీ రిజర్వేషన్లు తీసేస్తామని అంటున్నారని ఆయన మండిపడ్డారు. దేశంలో బిజెపి మతతత్వ రాజకీయాలు చేస్తోందని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. విభజన రాజకీయాలు చేస్తోన్న బిజెపికి ఎన్నికల్లో బుద్ధి చెప్పాలని ఈ సందర్భంగా జగ్గారెడ్డి పిలుపునిచ్చారు&

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌దాన వార్త‌లు

బీజేపీ స‌ర్కార్ తెలంగాణ‌లో కాంగ్రెస్ ప్ర‌భుత్వాన్ని కూల్చివేసేందుకు కుట్ర‌ జ‌రుపుతుందా?

Most Popular