Saturday, April 27, 2024

అదేమైనా అంతర్జాతీయ కుంభకోణమా సీఎం రేవంత్ పై నిప్పులు చెరిగిన కేటీఆర్

ఫోన్ ట్యాపింగ్ జరిగితే ఒకరిద్దరివి జరిగుండొచ్చు…. దానికే అంతర్జాతీయంగా కుంభకోణం జరిగినట్లుగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కలరింగ్ ఇస్తున్నాడని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మరోసారి ధ్వజమెత్తారు. దీనిపై ఏదేదో జరిగిపోయినట్లుగా లీకులు ఇవ్వడం ఎందుకని ప్రశ్నించారు. రేవంత్ సర్కార్ కు దమ్ముంటే ఫోన్ ట్యాపింగ్ పై  విచారణ చేసి దోషులపై తగు చర్యలు తీసుకోవాలని  డిమాండ్ చేశారు. ఇచ్చిన ఆరు గ్యారెంటీలను అమలు చేయేడం చేతకాని కాంగ్రెస్ సర్కార్….ప్రజల దృష్టిని మరల్చడానికి అదోదే స్కామ్‌..ఇదేదో స్కామ్  జరిగిందని  ఉత్తుత్తి హంగామా చేస్తోందని  ధ్వజమెత్తారు. ఇగో ఇది తప్పయింది..వీడిని పట్టుకున్నాం..లోపలేసినమని డైరెక్టుగా చెప్పవచ్చు కదా అని నిలదీశారు. దీనిపై యూట్యూబ్‌లలో ఎల్లన్నను…. మల్లన్నతో చెప్పించుడు.. తెల్లారిలేస్తే తిట్టిపించుడు ఎందుకని కేటీఆర్ అసహనం వ్యక్తం చేశారు.
బుధవారం తెలంగాణ భవన్ లో మల్కాజ్ గిరి లోక్ సభ నియోజకవర్గం పరిధిలోని నేతలతో కేటీఆర్ సమావేశమయ్యారు. ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహాలపై ఆయన దిశా నిర్ధేశం చేశారు.ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ, ఫోన్ ట్యాపింగ్ చేస్తే… ఒకరిద్దరు లుచ్చగాళ్లవి ట్యాప్ చేసిండొచ్చునని అన్నారు. అంతే తప్ప కేసీఆర్
కేసీఆర్ 10లక్షల ఫోన్లు ట్యాపింగ్ చేశారని బురద జల్లడంఎందుకున్నారు. అయినా అది పోలీసుల పని అని అన్నారు. ఇప్పుడు అధికారంలో ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వమే కదా…
తప్పులేమైన ఉంటే బయటపెట్టాలన్నారు. ఎవరినెవరిని లోపలేస్తావో వేయాలన్నారు.  దీనికి ఎవరు ఇక్కడ భయపడేటోడు ఎవడు లేరన్నారు. సచివాలయంలో లంకే బిందెలుంటాయనుకుంటే ఖాళీ కుండలే ఉన్నాయని రేవంత్ రెడ్డి చెప్పారని, హైదరాబాద్‌లో నీళ్లు లేక ఖాళీకుండలే ఉన్నాయని ముందు ఆ నీళ్ల సమస్య ఎందో చూడాలన్నారు. లంకె బిందెల కోసం వెతికేది దొంగలేనంటూ, టీడీపీలో ఏం చేసిండో నాకు తెలువదంటూ రేవంత్‌పై కేటీఆర్‌ వ్యంగ్యస్త్రాలను సంధించారు.
కాంగ్రెస్, బీఆర్ఎస్ ఎంఎల్ఎలతో కలిసి జంప్
రేవంత్ రెడ్డి ఎప్పటికీ కాంగ్రెస్ మనిషి కాదని.. బీజేపీలో చేరడమే ఆయన అంతిమ లక్ష్యమని కేటీఆర్ మరోసారి ఆరోపించారు. పార్లమెంట్ ఎన్నికలు ముగిసిన వెంటనే కొంతమంది బీఆర్ఎస్,, కాంగ్రెస్ ఎమ్మెల్యేలతో బీజేపీలోకి జంప్ అవుతారని సంచలన ఆరోపణలు చేశారు. పదేళ్లుగా రాష్ట్రానికి చిల్లిగవ్వ కూడా బీజేపీ ఇవ్వలేదన్నారు. ఇప్పుడెలా బీజేపీ అభ్యర్థులు తెలంగాణ ప్రజలను ఓట్లు అడుగుతారని మండిపడ్డారు. కేంద్రంలో పదేళ్ల పాటు అధికారంలో ఉన్న బీజేపీ.. తెలంగాణకు ఏం చేసిందో చెప్పి ఓట్లు అడగాలని డిమాండ్ చేశారు. కేజీవాల్ అరెస్టు అన్యాయం అంటున్న కాంగ్రెస్ నేతలకు కవిత అరెస్ట్ కనిపించడం లేదా? అని ప్రశ్నించారు.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌దాన వార్త‌లు

బీజేపీ స‌ర్కార్ తెలంగాణ‌లో కాంగ్రెస్ ప్ర‌భుత్వాన్ని కూల్చివేసేందుకు కుట్ర‌ జ‌రుపుతుందా?

Most Popular