Sunday, April 28, 2024

క్లిక్‌ అయితే చాలు బాక్సాఫీస్ బ్లాస్ట్‌

సమ్మర్‌ హీట్‌ మొదలైపోయింది. ఇంత హీట్‌లో ప్రేక్షకులను కూల్‌ చేయడానికి కూల.. కూల్‌.. సినిమాలు వచ్చేస్తున్నాయి. పరీక్షలు అయిపోయి విద్యార్థులంతా ఫ్రీ అయిపోతున్నారు. ఫ్రెండ్స్, ఫ్యామిలీతో థియేటర్లకు వెళ్లి సినిమాలు చూసి ఎంజాయ్ చేయాలని అందరూ తెగ ఎదురు చూస్తున్నారు. అందుకే సంక్రాంతి తర్వాత సమ్మర్ లో ఎక్కువ మూవీలు రిలీజ్ అవుతుంటాయి. అయితే వేసవిలో పెద్ద పెద్ద సినిమాలు వస్తాయని అంతా ఆశలు పెట్టుకుంటారు. కానీ కొన్నేళ్లుగా ఎక్కువగా చిన్న చిత్రాలే ప్రేక్షకుల ముందుకు వస్తున్నాయి. గత ఏడాది దసరా, విరూపాక్ష లాంటి మిడ్ రేంజ్ సినిమాలు బాక్సాఫీస్ వద్ద అలరించాయి. అప్పుడు విరూపాక్ష బిగ్గెస్ట్ హిట్ గా నిలిచిన విషయం తెలిసిందే. మరి ఈసారి కూడా వేసవిలో పెద్ద సినిమాలు ఏవి రిలీజ్ కానట్లే అన్నట్లు ఉంది పరిస్థితి చూస్తుంటే. జూనియర్ ఎన్టీఆర్ దేవర సినిమా.. అక్టోబర్ కు వాయిదా పడింది. పాన్ ఇండియా స్టార్ ప్రభాస్.. కల్కి మూవీ కూడా రిలీజ్ వాయిదా పడేటట్లు కనిపిస్తోంది. తెలుగు రాష్ట్రాల్లో మే13న పోలింగ్ జరగనుండడం వల్ల పోస్ట్ పోన్ అవుతుందని వార్తలు వస్తున్నాయి. ఎలక్షన్ల హంగామా ఉండడం వల్ల ఈసారి సినిమాలన్నీ కూడా పెండింగ్‌లోపడిపోయాయి. వేసవిలో ఇప్పటికే ఓం భీమ్ బుష్ మూవీ వచ్చి సూపర్ హిట్ అయిన విషయం తెలిసిందే. ఇక సిద్దు జొన్నలగడ్డ టిల్లు స్క్వేర్, విజయ్ దేవరకొండ ఫ్యామిలీ స్టార్, విశ్వక్ సేన్ గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి సినిమాలు ప్రేక్షకుల ముందుకు రానున్నాయి. ఈ సినిమాలన్నీ ఇప్పటికే మంచి బజ్ క్రియేట్ చేసుకున్నాయి.

టిల్లు స్క్వేర్‌ ఆల్రేడీ టిల్లు సినిమాతో విడుదలై మంచి హిట్‌ కొట్టిన విషయం తెలిసిందే ఎలాగే అదే కామెడీ డైలాగులు కంటిన్యూ అవుతాయి కాబట్టి ప్రేక్షకులు దీనిపైన కూడా మంచి హోప్స్‌ పెట్టుకున్నారని చెప్పవచ్చు. విజయ్‌దేవరకొండ ఫ్యామిలీ స్టార్‌ కూడా మంచి హిట్టే అయ్యేట్టు ఉన్నాయి. ఇక విశ్వక్‌సేన్‌ గ్యాంగ్స్‌ ఆఫ్‌ గోదావరి చిత్రం మాస్‌ ఎంటర్‌ టైనర్‌గా తెరకెక్కబోతుంది. ఆల్రేడీ విశ్వక్‌ గామి ఇటీవలె విడుదలై హిట్‌ కొట్టింది. మరి ఈ చిత్రం కూడా బాగానే ఆడుతుందని ప్రేక్షకులు అంచనాలు పెట్టుకున్నారు. అయితే ఈ మూవీలు మినిమమ్ హిట్ టాక్ సంపాదిస్తే చాలు.. బాక్సాఫీస్ వద్ద మంచి వసూళ్లు రాబట్టడం పక్కా అని చెప్పవచ్చు.
ఎందుకంటే వచ్చే 24 రోజుల్లో 13 సెలవులు ఉన్నాయి. ఈ విషయాన్ని ట్రేడ్ పండితులు గుర్తు చేస్తున్నారు. దీంతో టిల్లు స్క్వేర్, ఫ్యామిలీ స్టార్, గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి తో పాటు పలు సినిమాలకు పాజిటివ్ మౌత్ టాక్ వస్తే వసూళ్ల విషయంలో తిరుగుండదని చెబుతున్నారు. బాక్సాఫీస్ వద్ద లాభాల పంట పండించడం గ్యారంటీ అని అంటున్నారు. వాటితో పాటు వేసవి సెలవులు కూడా కలిసొస్తాయని చెబుతున్నారు. మరి ఆ 13 సెలవులు ఏంటంటే? మార్చి 29- గుడ్ ఫ్రైడే మార్చి 30- వీకెండ్ మార్చి 31- వీకెండ్ ఏప్రిల్ 05- బాబు జగ్జీవన్ రామ్ జయంతి ఏప్రిల్ 06- వీకెండ్ ఏప్రిల్ 07- వీకెండ్ ఏప్రిల్ 09- ఉగాది ఏప్రిల్ 10- రంజాన్ ఏప్రిల్ 13- వీకెండ్ ఏప్రిల్ 14- వీకెండ్ ఏప్రిల్ 17- రామనవమి ఏప్రిల్ 20- వీకెండ్ ఏప్రిల్ 21- వీకెండ్ & వేసవి సెలవులు కంటిన్యూ! మరి అప్ కమింగ్ సినిమాలు ఈ బంపరాఫర్ ను ఎలా వినియోగించుకుంటాయో చూడాలి. సినిమా కంటెంట్‌ బావుంటే హాలీడేస్‌ లేదు బిజీ లైఫ్‌ లేదు చూడాలనుకుంటే చూసేస్తున్నారు ప్రస్తుత తరం.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌దాన వార్త‌లు

బీజేపీ స‌ర్కార్ తెలంగాణ‌లో కాంగ్రెస్ ప్ర‌భుత్వాన్ని కూల్చివేసేందుకు కుట్ర‌ జ‌రుపుతుందా?

Most Popular