Sunday, April 28, 2024

వైఎస్‌ జగన్‌ పై సునీత కన్నెర్ర

– ప్రొద్దుటూరులో వైఎస్‌ వివేకా హత్య
– చిన్నాన్న అంటే నాన్న తరువాత నాన్న
– జగన్‌ పై సునీత ఆగ్రహం

టీఎస్‌న్యూస్‌ః వైఎస్ జగన్‌ తీరుపై దివంగత నేత వైఎస్ వివేకానంద రెడ్డి కూతురు సునీత కన్నెర్ర చేశారు. అసలు చిన్నాన్న అంటే అర్థం తెలుసా? అంటూ సీఎం జగన్‌ను ప్రశ్నించారు. గురువారం నాడు మీడియాతో మాట్లాడిన సునీత.. ప్రొద్దుటూరులో వైఎస్ వివేకా హత్య గురించి జగన్ చేసిన కామెంట్స్‌పై తీవ్రంగా స్పందించారు. ‘మా నాన్న హత్య కేసుపై మా అన్న జగన్ ప్రొద్దుటూరులో మాట్లాడాడు. చిన్నాన్న అంటే అర్థం తెలుసా? చిన్నాన్న అంటే నాన్న తరువాత నాన్న అని అర్థం. చిన్నాన్న కూతురు మీద నిందలు వేయడం న్యాయమా? నేను కోర్టుల చుట్టూ, పోలీసుల చుట్టూ తిరుగుతున్నా కనీసం ఆమె పై స్పందించలేదంటూ ఆమె ఆగ్రహం వ్యక్తం చేశారు. చిన్నాన్న చనిపోతే కనీసం న్యాయం చేయలేవా?’ అని జగన్‌పై నిప్పులు చెరిగారు సునీత.

తన తండ్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసు దర్యాప్తులో జరుగుతున్న జాప్యంపై ఆయన కూతురు వైఎస్ సునీత తీవ్ర అసంతృప్తిని వ్యక్తం చేశారు. ఈ కేసులో వైఎస్ అవినాశ్ రెడ్డికి శిక్ష పడాల్సిందేనని గతంలో సంచలన వ్యాఖ్యలు చేశారు. సొంత వాళ్లను అంత ఈజీగా అనుమానించలేమని… అందుకే హత్య జరిగిన తర్వాత జగన్ ను కలిసినప్పుడు ఆయనపై తనకు అనుమానం రాలేదని చెప్పారు. ఆ తర్వాత ఒక్కో విషయం అర్థమవుతూ వచ్చిందని అన్నారు. ఈ కేసులో వైసీపీ రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డిని సీబీఐ ఎందుకు విచారించడం లేదని ప్రశ్నించారు. ఆయనను కూడా విచారించాలని అన్నారు. ఈ హత్యలో జగన్ పాత్రపై కూడా విచారణ జరగాలని చెప్పారు.

వివేకాను చంపిన వారిని వదిలిపెడితే ప్రజల్లోకి ఎలాంటి సందేశం వెళ్తుందని సునీత గతంలోనే ప్రశ్నించారు. ఇలాంటి నేరాలు ఆగిపోవాలంటే నిందితులకు శిక్షలు పడాల్సిందేనని.. వైసీపీ మళ్లీ అధికారంలోకి వస్తే… తన తండ్రికి న్యాయం జరగదని చెప్పారు. జగన్ మళ్లీ సీఎం అయితే కష్టాలు మరింత ఎక్కువవుతాయని ఆందోళన వ్యక్తం చేశారు.

ఈ విషయంలో తాను అంతః ఖరణ శుద్దితో చెపుతున్నానని.. జగన్ అలా చెప్పగలడా? అని సునీత ప్రశ్నించారు. ‘వివేకా చిన్నాన్నను చంపింది ఎవరో దేవుడికి తెలుసు.. జిల్లా ప్రజలకు తెలుసు.. అంటున్నాడు జగన్. నేను పోరాడేది న్యాయం కోసం.. మీరు పోరాడేది పదవులు కోసం.’ అని సునీత ఆవేదన వ్యక్తం చేశారు. బాబాయ్‌ చనిపోతే కనీసం పట్టించుకోకుండా దాన్ని కూడా రాజకీయం చేస్తున్నారని సునీత అభిప్రాయపడుతున్నారు.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌దాన వార్త‌లు

బీజేపీ స‌ర్కార్ తెలంగాణ‌లో కాంగ్రెస్ ప్ర‌భుత్వాన్ని కూల్చివేసేందుకు కుట్ర‌ జ‌రుపుతుందా?

Most Popular