Wednesday, May 1, 2024

బిజెపితో బిఆర్‌ఎస్ సుఫారీ

  • కాంగ్రెస్‌ను ఓడించడానికి ఈ రెండు పార్టీల కుట్రలు
  • టిపిసిసి ప్రధానకార్యదర్శి అద్దంకి దయాకర్

గత ప్రభుత్వం తీసుకున్న తప్పుడు నిర్ణయాలు, అవినీతి, అక్రమాల వల్ల సుఫారీ రాజకీయాలు చేయాల్సిన పరిస్థితి బిజెపికి ఏర్పడిందని కాంగ్రెస్ నేత, టిపిసిసి ప్రధానకార్యదర్శి అద్దంకి దయాకర్ ఆరోపించారు. కాంగ్రెస్‌ను ఓడించేందుకు బిఆర్‌ఎస్ సుపారీ తీసుకొని బిజెపితో అగ్రిమెంట్ చేసుకుందని ఆయన విమర్శించారు. ఈ ఎన్నికల్లో బిజెపి కోసం బిఆర్‌ఎస్ పనిచేస్తుందన్నారు.

కెసిఆర్ ఎక్కడ తగ్గినా ఎక్కడ పెరుగుతున్నా అది బిజెపి కోసమేనని ఆయన విమర్శించారు. బిఆర్‌ఎస్, బిజెపిలు కలిసి కాంగ్రెస్‌కు నష్టం కలిగించాలని కొన్ని నియోజకవర్గాల్లో కక్ష గట్టి బిఆర్‌ఎస్ రాజకీయాలు చేస్తుందన్నారు. ఇది తెలంగాణ ప్రజలు గమనిస్తున్నారన్నారు. ఇలాంటి రాజకీయాలతో కెసిఆర్ సొంత పార్టీనే నాశనం అవుతుందన్నారు. నష్టపోతుందని తెలిసినా కూడా కెసిఆర్ ఏమాత్రం తగ్గడం లేదని అద్దంకి దయాకర్ ఆగ్రహం వ్యక్తం చేశారు.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌దాన వార్త‌లు

బీజేపీ స‌ర్కార్ తెలంగాణ‌లో కాంగ్రెస్ ప్ర‌భుత్వాన్ని కూల్చివేసేందుకు కుట్ర‌ జ‌రుపుతుందా?

Most Popular